పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

కనతి దూరముననున్న "చేౝ పావు కో" యను కుగ్రామమున నీమహానీయుడు జననమొందెను. చిన్ననాటి నుండియు బుద్ధుని యుపదేశములచే నాకర్షింపబడి యామతమును స్వీకరించి మతాభినివేశము కలిగియుండెను. ఇంతలో నీతని చిన్నన్నగారు బౌద్ధమఠమునందుజేరి భిక్షుకుడై, ధర్మము నభ్యసింప నారంభించెను. అతని మార్గము మన చిన్న బాలునికూడ నాకర్షించి, యిరువది సంవత్సరములయిన నిండుటకు పూర్వమే సన్యాసమును స్వీకరింప జేసెను. అంతట నీతఁడు మౌజయు గాషాయవస్త్రములను ధరించి కమండలమును గైకొని మండనము గావించుకొని భైక్షుకవృత్తిని గ్రహించెను. అది మొదలుగా జ్ఞానతృష్ణాతంత్రడై యెనిమిది సంవత్సరము లనేకమంది గురువుల నాశ్రయించుచు మఠములందు ధర్మము నభ్యసించుచు చీనాదేశమునంతయు గ్రుమ్మరెను. కాని అంతటితో నీతిని మనస్సు సంతృప్తి బొంది యుండలేదు. అతనికి పేరులు మాత్రము విన్న గ్రంథములను సంపాదించి స్వయముగ నభ్యసింప కోర్కెపుట్టెను. అంత బుద్ధుఁడవతరించిన పవిత్రభూమిని, తథాగతుడు జీవయాత్రని గడపిన పుణ్యక్షేత్రములను సందర్శించి పరమపురుషార్థమును గ్రహింపవలెనని సంకల్పించుకొనెను. అట్లు సంకల్పించి యెవ్వరికీ దెలియకుండ రహస్యముగ సన్నద్ధుడై క్రీ. శ. ౬౨౮ వ సంవత్సరమున భాద్రపద మాసమున నొకనాటి రాత్రివేళ బయలుదేరెను. అప్పటికాతనికి ౨౮ సంవత్సరములు వయసుండెను.