పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"రాయ లిట్లుతనమాయోపాయమును భగ్నపఱచుట గ్రహించి, యాగ్రహము పట్టజాలక, నాదుర్మార్గుడు పళ్లెరమునుండి బాకును దీసి రాయల దేహమంతయు తూట్ల పడునట్లుగ హఠాత్తుగ మీదపడి గాయములు గలుగజేసెను. ఈ దారుణ కృత్యమును లేశమయినను అనుమానింపకయున్న వాడుగావున రాయ లసహాయుడై, గాయపడి, సింహాసనము మీదనుండి వెనుకకు పడిపోయెను. అద్దురాత్ముడంతట రాయలు మరణించెనని భావించి, తన చెంతనున్న సేవకున కాతని శిరము ఖండించవలసినదని యాజ్ఞాపించెను. తానును తమకము నాపుకొనజాలక, రాజద్వారాము కడకు బోయి, యచ్చట నున్న పరివారముతో "నేను రాయలను; మంత్రిని ధన్నాయకులను, మండలేశ్వరులను ఎల్లరును జంపితిని. ఇపుడు నేనుసింహాసనమధిష్ఠింపబోవుచున్నాను" అని బిగ్గరగ నఱచెను. ఇంతలో రాయల తలను గొట్టుట కాజ్ఞాపింప బడిన ద్రోహి మెల్లగా రాయలచెంతకు జేరి కత్తి యెత్తునప్పటికి, రాయలు సింహాసనపుకాలు నూతగొని లేచి ఖడ్గమును దీసుకొని యాహంతకుని హృదయము పైనొక్క వ్రేటువేసి క్రిందకు బడద్రోసెను. ఆ సమయమున రాజభక్తి, విశ్వాసములుగల యొక భటుడు అంతవరకు భీతచిత్తుడై మూలను దాగియుండి రాయలు లేచుటయు, జీవించి యుండుటయు గాంచిధైర్యము దెచ్చుకొని, రాయలకుసాహాయ్యము గాబోయి, హంతకుని యమపురి కంపియుండెను. రాయలును, జరిగిన