పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రశ్నలు చేయుచు వచ్చెను. కొలువుకూటము నుండి సెలవుగైకొని యరుగు సమయమున, తొలినాటియట్లె కర్పూర తాంబూలము బంగారుపణము లయిదువందలుగల పట్టుసంచి యొకటియు, నాకొసంగ బడుచుండెను. ఇట్లు నన్ను బహూకరించు సందర్భమున నొకనాడు రాయలు, నన్నుచూచి, "ఓయీ,! మీరాజులు, తమకొలువు కేతెంచి రాయబారులతో సుఖవినోద గోష్టితో తనివినొందక సహపంక్తిభోజన మిచ్చిగౌరవింతురు. నీవు విమతస్థుడవు, నిజాతీయుడవు నగుటచే నీతో మాకు సహపంక్తి భోజనభాగ్యము లభింపదు గావున, అందులకై చక్రవర్తిచే నంపబడిన నీవంటి రాయబారి కుచితమైన రీతి భోజనమునకు మారుగా, మాగౌరవమును జూపుటకీ సువర్ణటంకము లొసంగితిమి." యని పలికెను.

తమలపాకులు - తాంబూలము

" తాంబూలము నమలుటచే గాబోలునేమి తమలపాకులయొక్క గుణముల వలననేమి, కర్ణాటభూపాలుడుతన అంత:పురమున, ఇంచుమించుగా నేడువందలమంది రాణులను, ఉంపుడు కత్తెలను భరించుకొనుచున్నాడు! అంత:పురములోనికి పదియేండ్లు గడచిన మగచిన్నవాడు సయితముబోరాదు. ఒకొక్కయువతికి, రాణియైనను, ఉంపుడుకత్తె యైనను, ప్రత్యేకముగ వేర్వేఱు వసతులు, పరిచారికలు, దాసదాసీజనమును గలరు. చివరికిద్గరు రాణులయిన, యిద్దరు ఉంపుటాండ్రయినను గలిసి నొక యింట నివసింపరు. ఈవిశాలరాజ్యమం