పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ళ్ళించుక పలుచగా నున్నవి. సొగసైన మీసమున్నది. గడ్డము మాత్రము లేదు. ఆతని చూపులును, దృష్టియు, చల్లనవై హృదయానందకరములై విశ్వాస, భయ, గౌరవములను గలిగింపజాలినవిగ నున్నవి. కొలువు కూటమును ప్రవేశించినపుడు నేనును గౌరవసూచకముగ శిరసువంఛియుంటిని. ప్రతీహారులు రాయలకు నన్నెఱిగించిరి. రాయలును అంతట నన్నుచితరీతిని సంభావించి, తన చెంత గూర్చుండ నాజ్ఞాపించెను. నేనపుడు మాప్రభువుపంపిన నుహృల్లేఖను రాయల కందీయ,[1] ఆతడు దానినితసదుబాసినిగైకొమ్మని యాదేశించి యిట్లని మృదుమధురగంభీర భాషనముల బల్కెను.

  1. అబ్దుర్‌ రజాక్ రాయలకొసగవలసిన యుత్తరములను మొదట పొరబడి సామూరి కర్పించెను. సామూరి ఆయుత్తరములు తనకు గావని దెలిసికొనినపుడు అబ్దుర్‌రజాక్‌న కిచ్చివేసియుండును. అందువలననే కళ్ళికోటయం దితనికి ఏమియు గౌరవము జరిగియుండలేదు. తనకు సామూరి సన్నిధిని జరిగిన పరాభవమును, నిరాదరణయు, గడుసుదనముగా నబ్దుర్‌రజాక్ చెప్పక దాచినాడు.