పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సీక యుత్తమాశ్వములను, తొమ్మిదిరకములు ఎర్రపట్టు, మొఖమలు పట్టువస్త్రములను, అంగీగుడ్డలను, రెండుపళ్ళెరములలో బెట్టి, రాయలకు కానుకగా సమర్పించితిని. వెనుక నేను వర్ణించిన నలువది స్తంభములుగల సభామంటపమున నత్యంత వైభవముతో నొకవేదికపై గల సింహాసనముపై రాయలు సుఖోపవిష్టుడై, నాకు దర్శనమిచ్చెను. కర్ణాటక్ష్మాపాలుడగు నా రాయలు ఒకవంక, పండితులు బ్రాహ్మణులు, కవులు, వేదాంతులు, వేశ్యలును, ఒకవంక వీరభటులు, సామంతమండలేశ్వరులు బలిసి కొలుచుచుండ, మహావైభవముతో కొలువు దీరియుండెను. ఆతడు పసుపుపచ్చని పట్టుతో చేయబడిన యుడుపులను ధరించియుండెను. మెడలో, నరత్నఖచితమై వెలలేని మంచిముత్యములచే చుట్టబడిన కంఠపట్టికను నానావిధరత్నభూషణములను ధరించియుండెను. అతని యాభరణముల విలువ ప్రపంచమున నేరత్నవర్తకుడుకూడ కట్టజాలడు; ఆతడు పచ్చని కుందనపు మేనిచాయగలవాడు. కొంచెము పలుచగానుండి పొడవైనవాడు. ఆతనిరూపరేఖాదులుచూడ చాల చిన్నవయసువాడుగా గానుపించినాడు.[1] ఆతని చెక్కి

  1. అబ్దుర్‌ రజాక్ వ్రాసిన దీసందర్భమున సంశయమునకు తావొసంగుచున్నది. అప్పటికిరువదియైదు సంవత్సరములనుండియేలుచున్న యిమ్మడిదేవరాయలు యౌవనవయస్కుడెట్లుగునో తెలియదు. ఒకవేళ నీ పారశీక రాయబారి సందర్శించినది, యిమ్మడిదేవరాయ లగునోకాదో? కాకున్న మరియెవరై యుందురు? ఒక్కటి నిజమయి యుండవచ్చును. యిమ్మడి దేవరాయలు క్రీ. 1443 ఏప్రిలుమాసమున క్రూరముగ చంపబడబోయెను. ఆవిఘాతమున, నాతడు మరణించినట్లు అబ్దుర్‌రజాక్ తెలుపలేదు. కావున, యిమ్మడి దేవరాయలు, కాయవంటివాడు గావచ్చుననియు, ధృడకాయుడగుటచేతగాని, పిన్ననాటనే సింహాసనమెక్కి యుండుటవలనగాని వయసుమీఱిన వాడుగాడనియు నూహింపవలయును; సింహాసనమెక్కునాటికి ఇరువదియేండ్లు నవ్నని యనుకొన్నను, రజాక్ చూచునప్పటికి నలువదియైదు సంవత్సరములకంటె నెక్కువ యుండజాలవు.