పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలసినదనియు, లేనియెడల వారలను గొనుటకై వెచ్చించిన ధనమును తెచ్చి యీయవలెనని ప్రకటించవలసినదని, తనసేవకుల పడికావలివాండ్రగు కాజ్ఞాపించెను. వారును అట్లు చేసియుండిరి. ఆబీదలు, పాఱిపోయిన వారిని తెచ్చియొప్పగింపలేక నెట్టెటో, మేము ఖర్చు పెట్టిన మొత్తమును దెలిసికొని తెచ్చియిచ్చిరి. ఇట్టివి చోద్యమయిన, యీ విజయనగర మహాపట్టణ వృత్తాంతములు! యీనగర మేలు రాయల పరిపాలనా విశేషములు!"

"ఈచరిత్రకారుడు, రాయలవారి యుద్యోగీయులచే సన్మానింపబడి, యాతనికై నియోగింప బడియున్న రమ్య హర్మ్య తలమున విడిది దిగియుండెను. ప్రయాణపు బడలిక వలన నీతని దేహము మిక్కిలి అలసి సొలసి యుండి నందున పెక్కుదినము లితడు సుఖముగ, నిర్విచారముగ, నాచక్కని సౌధమున, స్వర్గసమమైన యామహానగరమున నేకొదువయును లేక మొహరము పండుగలు వచ్చునంత వఱకు గాలము బుచ్చెను.

రాయల సందర్శన భాగ్యము.

"ఇట్లుండ నొకనాడు రాయలవారి సన్నిధినుండి నా కొఱకై చారులువచ్చి, సార్వభౌముని యాజ్ఞయైనదని, తెలియచేసిరి. ఆసాయంకాలము నేనును సర్వసన్నద్ధుడనై, కొలువు కూటమున కేగి, రాయల సందర్శనప్రాప్తికి పరమానందము నొందుచు, మాయేలిక యభిమతానుసారముగ, నైదు పార