పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాండ్ర పొత్తుగూడి సుఖింపగోరువా డీవీధినిబోయి, తన యిచ్చవచ్చిన తరుణిని గోరుకొని బడయవచ్చును. వేశ్యాగృహములందు పరిచారికలు, దాసీలు, మిక్కిలి జాగరూకులయి యుందురు. పడపుటిల్లాండ్రకై వచ్చిన విటులసొ త్తేదయిన నొకగ్రుడ్డిగవ్వైన పోయినను పరిచారికల ప్రాణము మీదికి వచ్చును. వేంటనే వారు గృహమునుండి వెడలగొట్టబడుదురు. ఈనగరపు టేడుప్రహరీలనడుమ లెక్కకుమించిన వేశ్యాగృహములున్నవి. ఈ వేశ్యలవలన రాబట్టబడిన పండ్రెండువేల పణము లనుదినమును నగరు కావలివాండ్ర జీతబత్తెములకై వినియోగింపబడును. ఈ కావలివాం డ్రనుదినమును, అనుక్షణమును ఈయేడు కోటలనడుమ నేమేమిజరుగుచున్నదో, ప్రతిక్షణమును కటకపాలున నకెరిగించుచుండవలయును. ఏవస్తు వెచ్చట పోయినను, ఎక్క డే దొంగతనము జరిగినను తక్షణము నేరస్థుడని వెదకి, పోయిన సొత్తును సొత్తువానికి జేర్పవలయును. నగరమున ఏ నేరమును జరుగ నియ్యరాదు. వారివలన నేలోపమయిన వచ్చినచో, దానికి వారుకొంత జరిమానా నిన్చుకొన వలయును. నాస్నేహితుడొకడు కొందఱి బానిసవాండ్రను కొనియుండ, వారు తమ కావలివాండ్ర యధీనము తప్పించుకొని పారిపోయిరి. ఈ వృత్తాంతమును మేము నగరపాలకునికి (కటక పాలుడు) ఎరిగించినంత, నాతడు మేమున్న పట్టణ ప్రాంతమందంతటను గల బీదసాదలను, పాఱిపోయిన బానిసలను పట్టితెచ్చి యొప్పగింప