పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యున్నవి. ఆ ప్రాంగణములందు చంద్రకాంతశిలానిర్చితములయిన వేదికలు వరుసగా గలవు. ఆ వేదికలకువెనుక, మేడ గోడలపై సింహములు, పులులు, చిరుతపులులు, ఏనుగులు మున్నగు వన్యమృగము లనేకములు జీవము లుట్టిపనినట్టు చిత్రింపబడియున్నవి. అపరాహ్ణమున, ఎండవేడిమి యించుక తగ్గుచుండువేళ నీవారవిలాసినులు చక్కగా నలంకరింపబడిన తమయిండ్ల ప్రాంగణములందున్న చంద్రకాంతశిలావేదికలపై తివాసులమీదను, సోఫాలమీదను, విలాసముగ, హొయలు మీఱి చేటీజనముతో సుఖొపవిష్టులయి, యుందురు. ప్రతి వెలపడుచును ఒడలంతయు, నవరత్నఖచిత మూల్యాభరణములతో, మంచిముత్తెముల హారములతో కన్నులకు మిఱుమిట్లుగొల్పు చక్కదనముతో రంగురంగుల చీరెలుకట్టి యలకరించుకొని, చూచువారల హృదయములను జూఱగొను చుండును. అచ్చటివారందఱు, పదియాఱ్వన్నె కుందనపు శలాకలవలెనుండు నెఱజవ్వనపు సొగసుకత్తెలే! ఒక్కొక్క పడుపుటింటికి ఇద్దరు ముగ్గురు దాసీలుందురు. వారు తమ యజమాను రాండ్రకడ నిలువబడి, మార్గమున బోవువిట కాండ్రను తమనేర్పఱితన ముట్టిపడునట్లు, వెల్లాటకత్తెల సౌందర్య సముద్రములో ముంచివేయ బ్రయత్నించు చుందురు. ఆవీథిని మన్మధుడు తన చెఱకువింటిని, సంధించి, శరంపరలు గ్రుమ్మరించుచు రేబవలు సంచరించుచు యప్సరసలను బోలిన ఆకాంతల వలలోవిరహులగు వారిని బడద్రోయుచుండును. వెల