పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

చున్నారు. ఈతని నామాక్షరముల వర్ణక్రమము, నుచ్చారణము ఏడవ శతాబ్దము నందుండినట్లుక కాలాను గతముగ అక్షరముల పోలికవలెనే మారిపోయి వివిధములుగ వ్రాయబడుటయు నుచ్చరింపబడుతయు నందు లకు గారణములు. జపానీయులీతని నామాక్షరములను వ్రాతలో హ్యువా౯ట్స్యాంగనియు నుచ్ఛారణయందు "గెంజో" యనియు వాడుచున్నారు. ఈపేరు చీనాభాషకో యుఁఆ౯త్స్యాంగునకు సరిపోవును. ప్రాచీన లిపిని పరిశోధించి యాతనినామమును స్ఫుటముచేసిన ఈకాలమున చీనాపండితు లీయాత్రికుని నామము "యుఁఆన్‌ చ్వాంగ్‌"అని యుచ్చరింపవలయునని నిర్ణయించిరి. ఆయుచ్చారణ మంగీకరించుచు మేమిా వృత్తాంతమున వాడి యున్నాము.

యుఁఆన్‌ చ్వాంగ్‌ యొక్క పవిత్రజీవిత చరిత్రము మనకు ప్రస్తుత మనవసరముగాదు. కావున అతని జన్మకాలా దులను గూర్చి మాత్రము సంగ్రహముగ దెల్పి యావల యాతని గ్రంథమును జదివిచూతము. పురాతన కాలము నుండియు గౌరవ ప్రతిష్టలు గలిగి ఋజువర్తలనియు, ధార్మికులనియు బేరుగాంచి, చక్రవర్తికడ నూడిగమును వంశపారంపర్యముగ జేయుచు ప్రసిద్ధి వడసిన 'చేన్‌' వంశమునందు యుఁఆన్‌ చ్వాంగ్‌ జనించెను. అతడు, పూత జన్ములయిన ఆతని తలిదండ్రులకు బుట్టిన నలుగురి కొడుకులలో గడగొట్టువాడు. సోదరులతో పాటు తండ్రికడ, కులవిద్య నభసించుచు, నితర గురువులను గూడ నాశ్రయించి క్రొత్త విద్యల