పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ దేశాచారమునుబట్టి రాయలకు సామంతమండలేశ్వరులు మహామండలేశ్వరులు తామీయవలసిన కప్పమును సంవత్సరమున కొకమారు టంకశాలయందు చెల్లించుచుండుట యలవాటు. ఎవరికైన ధనమీయ దలచినపుడు రాయలు టంకశాలకు వాని కివ్వదలచిన దానికి రాయస మంపును. భటవర్గమున భత్యము నాలుగు నెలల కొకతూరి రాయలిచ్చుచుండును. అందరికిని టంకములనే యిత్తురుగాని, సామంతరాజ్యములపై వచ్చు పన్ను లాదాయమును విలియవేయు నాచారము రాయలపాలనము లందు లేదు.

"ఈ దేశపుజనసంఖ్య యింతయని యుజ్జాయింపుగానైనను చెప్పుటకు వలనుగాదు. ఎచ్చట గాంచినను దేశమంతయు జనసంకీర్ణము. ఇసుకవైచిన రాలనంతమంది జనులున్నారు. రాయల కోశాగారమందు ధనము దాచు కొనుటకై పాతాళపుకొట్టు లనేకములు గలవు. అందు బంగారము వెండి కరిగించి దిమ్మలుగా బోసియుంచుదురట. ఈ దేశమునందు పేదవాని మొదలుకొని భాగ్యవంతుని వఱకు స్త్రీలు, పురుషులు, బాలురు, చివరకు వీధులలో దొమ్మరిలాటలాడు దొమ్మరులు సయితము చేతులకు, దండలకు, మెడలకు, కాళ్ళకు, అమూల్య రత్నాభరణములో, పూత మెఱుగు నగలో ఏవోకొన్నిటిని ధరించుకొందురు."

ఈకాలపు విజయనగర యాత్రికులకు రజాక్ వర్ణించిన రాయల సువర్ణరత్నపు భాండారము అంత:పురసౌధమునకును