పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నగరునకు ఎడమవైపున ధన్నాయకుని సౌధము, నా వెనుక టంకశాల, గలదు. ఇచ్చటయు నీ దేశమందు చలామణి యగుచున్న నాణెము లన్నియు ముద్రింప బడుచున్నవి. ఈదేశమున మూడు విధముల బంగారు టంకములు, రాగికలిపి ముద్రింప బడుచున్నవి. వానిలో మొదటిది హొన్ను లేక వరహా[1]. ఈవరహా మన దేశపుకొవన్ దీనారములకు రెండింటికి సమానము. వరహాలో సగము విలువగల నాణెమింకొకటి గలదు. దానిపేరు ప్రతాపము.[2] ఇది రెండవ నాణెము. మూడవది బంగారపు పణము. వరహాకు ఇరువది పణములు ప్రతాపమునకు పదిపణములు నిత్తురు. పణమునకు నారు "తర"[3] ములను వెండినాణెములు వచ్చును. 'తర' మునకు మూడు "జితలు"[4] అను రాగిటంకములు వచ్చును.

  1. వరహాకు దీనారమని పేరుండినట్లు శ్రీనాథుని చాటుపద్యమువలననేకాక మహమ్మదీయ చరిత్రకారులవలన గూడ దెలియుచున్నది.
  2. అర్ధవరహాలు-ప్రతాపములు. ఇవి ప్రౌడదేవరాయలచే, ముద్రితమయినవి గావలయును. ఆతనికి ప్రతాపదేవరాయలని బిరుదముగలదు. ఆబిరుద మీటంకమునకు నిలచిపోయి యుండును.
  3. తరమను టంకమున్న సంగతి దెలుపు శ్రాసనప్రమాణము లేమియు ఇంతవరకు గానరాలేదు. ఇవి వెండిపణములుగాని, రూకలుగాని గానవచ్చును. తెలుదేశమున విజయనగరపు నాణెములు రూకలుండెను.
  4. జితలు అను రాగిడబ్బు పేరుగూడ కర్ణాటకదేశములో వ్యవహారమందున్నదేమోగాని యిచ్చట నాకు దెలియదు. అది మహారాష్ట్రభాషాపదము. ఇవి రాగికాసులు గావచ్చును.