పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోవుటవలన వాటిపైని వ్రాయబడిన అక్షరములును చిరకాలము నిలువజాలవు. ఇక రెండవపద్ధతి: తెల్లని ఫలకములకు నల్లరంగుపూసి వాటిపై, రాతిబలపములను పెట్టి తెల్లగా వ్రాయుట. ఈపద్ధతి చాల మంచిదట. ఇట్లు వ్రాసిన యక్షరములు చాలకాలము నిలచియుండును.[1]

"స్తంభములు గల యాసభామంటపమున నెత్తైన వేదికపై ధన్నాయకుడు (దళవాయి-సర్వసేనాధిపతి) రాజకీయోద్యోగులు పరివేష్టించియుండ కొలువు తీరియుండును.[2] ఉభయ పార్శ్వములందును వేత్రహస్తులు (చోబుదారులు) బారులుతీరి నిలువబడి యుందురు. మంత్రి శేఖరునితో విజ్ఞాపన మ్మొనరించుకొన దలంచినవారు ఈవేత్రహస్తుల నడుమ నడచివచ్చి, ఏదైన యొకవస్తువును కానుకగా నర్పించి, సాష్టాంగ దండప్రణామ మాచరించి లేచి నిలువబడి ముకుళిత హస్తులై శిరమువంచి, మనవి దెలిపికొందురు. ధన్నాయకుడును వారి విన్నపమాలించి, యుచిత రీతిని న్యాయ విమర్శనము గావించి తీర్పిచ్చి పంపివేయును. ఆతని తీర్పునకు తిరుగులేదు. దణ్ణాయడు

  1. శిలాశాసనములు గానచ్చును. అబ్దుర్‌రజాక్ వ్రాయసకాండ్ర దేశాచారములు తెలియనివాడు గావున, పొరబడి యుండవచ్చును.
  2. ధన్నాయకుడు యొకయుద్యోగి యని తెలిసికొనక పోవుటయే కాక నాతడు కొజ్జావాడనియు గూడ రజాక్ పొరబడి వ్రాయుచున్నాడు. ఇమ్మడి దేవరాయని ధన్నాయకుని పేరు నాగన్నయని లూయిరైసు గారు చెప్పుచున్నారు. కాని అబ్దుర్ రజాకు కాలమున మహాప్రథాని లక్కణ ఒడయలని శాసనప్రమాణముగలదు - ముందు చూడుడు.