పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్ర మిప్పటికి నిలచియున్నది. ఆరవకోటగోడ కమలాపురపు తటాకమునకు దక్షిణముగా బోయి చుట్టివచ్చును. ఏడవప్రాకార మిప్పటికి మంచిస్థితియం దున్నది. అందున్న నగరులు సౌధములు, మంటపములు, దేవాలయములు, సభాగారములు, మందిరములు మంచి స్థితియందున్నవి. ఈప్రాకారములోని ప్రదేశము తూర్పు పడమరలు రెండుంబాతికమైళ్ళును ఉత్తరదక్షిణములు ఒకమైలును, పొడవును వైశాల్యమును గలిగియున్నది.

ఈ కాలమున విజయనగరమును జూచివచ్చిన వారికి రజాక్ వర్ణనలుబట్టి ప్రాచీన విజయనగరమును అర్థము చేసికొనుట కష్టముగానుండును. ఆతడు వర్ణించిన నాలుగు ధనురాకారముగల తోరణములును మంటపములుగల గోపురములు నిపుడు గానరావు. ఆతడు చెప్పిన నాలుగువీథులలో నొకటి తూర్పుగాబోయి తుంగభద్రమీదుగా నానెగొందెకు పోవును. దానికి తాంబూలపు వీథి యని పిలతురు. ఈవీధి ముఖమున నిలువబడియే మన రజాక్ నగరును ముందు వర్ణించి యుండును. ఈ వీధికి సూటిగా నింకొకవీధి పశ్చిమముగా నరిగి కమలాపురపు కోటగుమ్మముచెంత, నుత్తరముగా తుంగభద్ర హంపీ విరూపాక్ష క్షేత్రములకు బోవువీధిని గలసుకొనును. నగరివాకిటను నాల్గువీథులనడుమ తోరణ, గోపుర, మంటపములనడుమ ప్రదేశము నానావిధములగు అంగళ్ళతో నిండి యానాడు రమణీయకముగా నుండెనుగాబోలు. ఆగోపుర