పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


"అయ్యది ఱాతితోడను సున్నముతోడను గట్టిగాగట్ట బడి బలిష్ఠమైన కవాటమును కలిగియున్నది. ఆద్వారము చెంత రేయింబవళ్లెల్లప్పుడును రక్షకభటులు ఏమరక పడికావలి గాయుచుందురు. వారు దుర్గరక్షణమందెంత అప్రమత్తులుగ నుందురో, యాగంతులకడ నగరప్రవేశపు సుంకమును గైకొనుటలో కూడ నంతటి యప్రమత్తులు.[1] వెలికోటనుండి, లోని రెండవ ప్రాకారమును, దానిని గడచి మూడవ దానిని, అందుండి నాలుగవకోట ద్వారమును అట్లు వరుసగా దాటుచుపోయి యేడవ ప్రాకారమును సమీపించితిమి. ఈకడపటి ప్రాకారము లోపల, రాయల మందిరములు, సౌధములు, సభామంటపములు, కొలువుకూటములు, కచ్చేరీలు గలవు. నగరమునకు వెలుపలగల ఏడవ ప్రాకారమునకు నాలుగు గసనులు గలవు. అం

  1. ఈవిధముగ మనదేశమున, ముఖ్యనగరముల వెలుపలగవనుకడనాగంతుకుల కడనుండియు, సుంకముతీయు నాచారము పూర్వముండెను. ఈ బ్రిటిషు పరిపాలనమున నది తీసివేయబడెను.