పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిండు రాజసముతో నన్నుజేరి, ఆదరమొప్ప "నీవింక భయపడకుము, మనసు నూరక నాయాస పెట్టుకొని ఖేదింపకుము. నీకష్టములు త్వరలో తుదిముట్టగలవు" అని గంభీరభాషణముల బలికెను.

"ఉదయమయిన తరువాత నేను నమాజుచేసు కొని కూర్చుండి నపుడు కడచిన రాత్రి కన్న కల జ్ఞప్తికివచ్చి, నన్నొకింత యానంద పరవశునిగా జేసెను.సాధారణముగా స్వప్నములు, తదేక ధ్యానముతో తలపోసి కొనుచున్న వారికి వచ్చును. కలలోని వృత్తాంతములు, పగటిపూట ఎన్నడును జరుగ జాలవు. అయినను కొన్ని స్వప్నములు దైవప్రేరితములనియు, నవి తప్పక జరుగు ననియు పెద్దలు చెప్పుటయు గూడ గలదు. ఖొరానునం దట్టి ప్రమాణము లెన్ని లేవు?

"దైవమునకు నాపై నిప్పటికి కరుణ గలిగెననియు దు:ఖభాజనమైన నాజీవితభాగము సాంతమయ్యెననియు త్వరలో నా కదృష్టము పట్టుట కిది శుభసూచక మనియు, నూరక తలపోయుచు, ఆనందించుచు కాలము గడిపితిని. పండితులయిన వారికి కొందఱికి నాకల వివరించి తెల్పి వారిని దాని యర్థమువిప్పి చెప్పవలసినదని కోరునంతలో విజయనగర చక్రవర్తి కడనుండి యొకదూత వచ్చెననియు, నాచక్రవర్తి చాలసామ్రాజ్యమునేలు సార్వభౌముడనియు, నిపు డాతని రాయబారి సామూరికి పారసీక దేశమునుండి యేతెంచిన రాయబారిని తక్షణము తనయొద్దకు బంపవలసినదనియు, నాజ్ఞాపించు నొక