పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశము నుండి వారి కావశ్యకములయిన సరకులు గొంపోవ బడుచుండు ననియుగూడ వినియుండెను.

"ఇదిజరిగిన కొంత కాలమునకు వంగదేశపు సుల్తాను, జాన్పూరు సుల్తానగు ఇబ్రహీంవలన తన కెక్కువ బాథలు కలుగు చున్నవనియు, నాతని జయించుటకు కొంతసైన్య సహాయ మంప వలసినదనియు, మాచక్రవర్తిని శరణుజొచ్చెను. శరణాగత రక్షకుడగు మాచక్రవర్తి వెంటనే జాన్పూరునకు షెయిఖుల్-ఇస్లామ్ ఖ్వాజాకరీముద్దీన్-అబూ-అల్ మకారిమ్ జామీ అను నాతని రాయబారిగా నంపి, వంగదేశముపై నిక ముందెప్పుడును యుద్ధమునకు బోయి బాధింప వలదనియి, నట్లుగావించిన వాటిల్లు అనర్థములకు తానే నిందించుకొన వలయుననియు జాన్పూరు సుల్తానునకు సందేశమంపియుండెను.[1]

"అందులకు జాంపూరు సుల్తాను చక్రవర్తి యాజ్ఞను శిరసాసహించెను. కళ్ళికోటనగరాధీశు డీవృత్తాంతము వినిన వెంటనే తనదేశమునందు దొరకు విలువగల వింతవస్తువులను ప్రోగుచేసి మాచక్రవర్తి స్నేహమభిలషించుచు నొక రాయబారమంపెను. మరియు తనరాజ్యమున మహమ్మదీయులు ప్రతిశుక్రవారమునాడు నేయాటంకములేక నమాజు చేసికొనుచు, మసీదులలో ఖుతుబాను పఠించు చున్నారనియు,

  1. అబ్దుల్ రజాక్ చెప్పునదంతయు విస్పష్టమగుటలేదు. ఆత డుదహరించినవిషయములు బంగాళాదేశమునకు సరిపోవు. గుజరాత్, దఖిణీసుల్తానుల యుద్ధములకు సరిపోవు నేమోనిర్ణయింపజాలను.