పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని కళ్ళికోటలోనట్లుగాదు. విదేశమునుండి వచ్చిన యోడ అయినప్పటికిని ఎట్టిదుస్థితిలో రేవును జేరినప్పటికి నితర యోడలతో సరిసమానముగ సంరక్షింపబడును. ఆయోడ కెట్టియాపదము వాటిల్లదు.

"మాయేలిక యగుసుల్తాను షా-రుఫీ-ఖాకానీ-సయిద్ నృపాలుడు కళ్ళికోట నగరాధీశున కుత్తమాశ్వములను మేలైన జరీయంగీలు, కుళ్ళాయిలు మొదలగు నమూల్యములయిన యుడుపులను - సంవత్సరాది పండుగనాడు కానుకగా నర్పింప దగినవి - బహుమతులుగా నంపియుండెదు.[1]

"ఇందులకు గారణ మాచక్రవర్తిచే నంపబడిన రాయబారులు బంగాళాదేశము నుండి తిరిగివచ్చు సమయమున, కళ్ళికోటరేవున దిగవలసి వచ్చుటయు, నపుడు వారు నామురీకి మారాజు ప్రశస్తినిగూర్చి విశేషముగా దెలుపుటయు సంభవించెను. ఆరాయబారులు స్వదేశమును చేరినపుడు వారి ముఖమున మా చక్రవర్తి కళ్ళికోటను గూర్చి యంతయు దెలిసికొని యుండెను. మరియు ప్రపంచమున నున్న నృపాలురందఱుగూడ కళ్ళికోట ప్రభువుతో నెయ్యము సలుపుట కిచ్చగింతురనియు, నాతని

  1. అబ్దుర్ రజాక్ రాయబారిగా విజయనగరమునకు బంపబడియుండగా కళ్ళికోటసామూరియే తన యేలిక యనుకొనిన చక్రవర్తియని పొరపడి యాతడు పంపిన కానుకలన్నియు సామూరికి నర్పించెను. పిమ్మట తనతప్పు తెలిసికొని యది యితరులకు దెలియకుండ గడుసుదనముగ గప్పిపుచ్చెను. ముందు చూడుడు.