పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారలకందఱకును దైవభక్తి పరాయణుడయిన యొక 'కాజీ' కూడగలడు. ఇక్కడి మహమ్మదీయులందఱు "షాఫీ' కులస్థులు సంపన్నులయిన వర్తకులు. సముద్రతీరపు దేశాంతర పట్టణముల నుండి విలువగల వస్తువులను దెచ్చివర్తకులీరేవున దింపుకొనుచు విచ్చలవిడిగ వీథులందును, రచ్చలందును రాజబాటలందును కావలిలేకయే నిలువజేసు కొందురు. ఈనగరమున నెవరికి నేభీతియు నన్యాయ భయమును కలుగనంతటి ధర్మపరిపాలనము గలదు. ఎంతటి విలువగలవస్తు వెచట నిర్భయముగా పారవేసి యుంచినను దొంగభయమనునది లేదు. వర్తకులు తాము నిలువ జేసికొనిన సరకులపై నెవరిని కాపుంచ నక్కరలేకయే రేవుసుంకాధికారులచే భద్రముగా జూడబడుచుండును. రాత్రింబవళ్ళు వారు వాటిచుట్టును కావలి గాయుచుందురు. విదేశవర్తకులు దెచ్చినసరకు అమ్ముడు పడువఱకు వానిపై సుంకమును దీయరు. అమ్మబడిన సరకులకు వెలపై నూటికి 2 8||8 (2 1/2)చొప్పున సుంకము గైకొందురు. ఇతర రేవులను జేరవలసిన సరకుతో నిండిన ఓడలు వాయువశమున గమ్యస్థానమును నగానక నితర రేవులకడ నెక్కడైన మెట్టపట్టిపోయినచో నచ్చటి ప్రజలాయోడలోని సరకులను గొల్లగొట్టు నాచారమున్నది[1]

  1. ఇట్టి దురాచారమే యాంధ్రదేశమున కాకతీయ గణపతిదేవుని కాలమునకు బూర్వ ముండినట్లు శాసన ప్రమాణములు గలదు. చూడుడు. ప్రాచీనాంధ్ర నౌకాజీవనము పుట 126-8; Ep. Ind. Vol. XII p. 188 ff.