పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాజనమై యంధకార ప్రక్రియనున్న మా దుస్థితికి ఆ మొహరమ్ [1] నాటి విదియచంద్రుడు ఆశా కిరణములను ప్రసరింపజేసెను. ఆయ్యది దక్షిణాయనమైనను సూర్యుని వేడిమి మాత్రము దుస్సహముగా నుండెను. గనులలోని కెంపులును, ఎముకలలో క్రొవ్వునుగూడ కరిగింపజేయు నంతటి వేడిగాడ్పు వీచెను. ఆవేడికి మేము తాళలేక పోతిమి. నేను, నా జ్యేష్ట సోదరుడును, మరికొందరు ప్రియమిత్రులు మొదలగువార లనేకు లాయుష్ణమునకు తాళజాలక ఆరోగ్యము చెడి చాల జబ్బు పడితిమి. అట్లు జబ్బువలన నొకరి తరువాత నొకరు నాలుగు మాసములు బాధపడుచు నచ్చటనే యుండిపోతిమి. కాని ఆయూరివారు కొందరు, కరియాట్ గ్రామమున కంటె సపూర్ అను పట్టణము చాలమంచి ఆరోగ్యకరమైన నగరమనియు, నచ్చట మంచి తియ్యని ఆరోగ్యవంతమైన నీరు లభించుననియు నచ్చటికి బోయిన శీఘ్రమే పున రారోగ్యముగలుగుననియు బలుమారు చెప్పు చుండుటచేత వారిమాటలు విశ్వసించి యింకను లేవలేనిస్థితిలో నున్నపుడు నేను ఓడమీద బయలు దేరితిని. కాని నా దౌర్భాగ్య వశమున అక్కడ బ్రవేశించిన వెంటనే నాకు రోగ మెక్కువయ్యెను. ఇక్కడ నున్నప్పుడే నా పెద్దన్నగారు మవులానా ఆఫీ-వుద్దీన్ అబుల్ సహాబు గారు

  1. మొహరమ్‌ పండుగ ముసల్మానులకు సంవత్సరాదివంటిది. ఫసలీ అంతటనుంచి లెక్క పెట్టబడుచుండును.