పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రును "మస్కాటు" రేవున ఓడ దిగిపోయిరి.[1] పాపము వారందరు నోడకేవును ముందుగానే యిచ్చి యుండినందున యానము పూర్తిగాకుండ నోడ దిగుటచే వారెంతో నష్టవడుటయే కాక సరకుల గూర్చి చాలా చిక్కులుపడిరి.

"ఇక నేనును వారితో పాటు మస్కాటురేవున దిగి యచ్చట మాత్రమాగక "కరియాట్" అను పట్టణమునకు బోయి యచ్చట నివాస మేర్పరచుకొంటిని. ఓడ పయనము పూర్తిగా కుండిన పుడును, అర్ధాంతముగ నెక్కడనైన కొంతకాలము తలదాచుకొన వలసినపుడును, సముద్రవ్యాపారులు దిక్కుమాలిన వారివలె యిడుమల పాలగుదురు. ఆ యిబ్బందులు వారికే తెలియ వలయును. దైవము నిర్దయుడై యుండుట వలనను, నాదురదృష్టము ఇంకను దరిచేరకుండుట వలనను నేను కొంచ మధైర్యము చెందితిని. నా హృదయము బ్రద్దలయిన గాజుముక్కల వలె చెదరిపోయెను. బాధలననుభవింపలేక, తుదకు ప్రాణముపై అసహ్యము కలిగి యంతకన్న చచ్చిన మేలను కొంటిని.

"ఇట్టి స్థితియందు, వేరు గతిలేని మేము కరియాట్ గ్రామమున సముద్రపుటొడ్డున కాపుర ముంటిమి. ఇంతలో మొహరమ్ పండుగవచ్చెను. ఆపండుగల తొలినాటి రాత్రి చంద్రు డతి మనోహరమయిన రేఖతో వెలుగసాగెను. దు:ఖ

  1. మస్కాటురేవు, హార్మజునగరమునకు దక్షిణమున ఉమాన్ సింధుశాఖ ముఖమున అరేబియాలోనున్నది.