పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(క్రీ. శ. 1178-1209) వఱకును బరిపాలించెను. ఈతనికి బయ్యల మహాదేవివలన రుద్రరాజు జనించెను. ఈకోట రుద్రరాజు కాలముననే గణపతిదేవ చక్రవర్తి వెలనాటి భూపతులను జయించి పూర్వాంధ్ర దేశమును సింహాచలపర్యంతము స్వాధీనముచేసుకొనెను. ఓడింపబడిన వెలనాటి వంశాకురములవలనగాని పాకనీటి ప్రభువులవలనగాని, కాంచీపుర చోళులవలనగాని తెలుగు చోళభూపతులవలనగాని మున్ముందే యుపద్రవమును సంభవించుకుండ తనరాజ్యమును బదిలపడుటకై గణపతిదేవుడు దనరెండవ కూతురైన గణపాంబాదేవిని కోట రుద్రదేవరాజు సుతుడైన బేతరాజునకిచ్చి వివాహము గావించెను. రుద్రదేవరా జెంతకాలము పరిపాలించెనో తెలియదుగాని యించుమించుగా నితడు క్రీ. శ. 1210 మొదలుకొని 1216 సంవత్సరములనడుమ మరణించి యుండవలయునని దోచుచున్నది. దేవగిరి రాజ్యాధీశుడైన జైత్రపాలుడు రుద్రదేవుడను యాంధ్రరాజు నొకని రణరంగమున బట్టుకొని నరమేథయాగమును చేసినట్లు చెప్పకొనుచున్నాడు.[1] జైత్రపాలుని ప్రశస్తి ఆలంకార భూయిష్ఠములయిన ఆడంబరవాక్యములతో నిండియున్నను గణపతిదేవునికి నాతనికి సంభవించిన పోరులో కోటరుద్రరాజు గణపతిదేవునిపక్షమున పోరాడి యోడి, పట్టువడి యంతట దుర్మరణమువాత బడియుండెనని

  1. హేమాద్రిపండితుని వ్రతఖండపీఠిక 51 వ శ్లోకము Bombay gazettear Vol. 1 part pp 95-96