పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదలుగాగలవా రెందరో నిరూపించియున్నారు. కాని వారి యూహ ప్రమాదజనితమైన దేమోయని సందియ మగుచున్నది. మార్కోపోలో యదార్థమునే వచించినట్లును, ఆతడు వ్రాసిన దానిని, చారిత్రకులు మన దేశచరిత్ర బాగుగా బయలు పడనందున మరియొక రీతిగా నన్వయించుకొని మార్కోపోలో యుదహరించిన నారీరత్నము, రుద్రాంబిక యని భ్రమపడి, యామె గణపతిదేవుని భార్య కాదని విశదీకరించుట కెంతయో ప్రయాస పడిరి. మన కిపుడు, మార్కోపోలో ప్రశంసజేసిన రాణి రుద్రాంబిక కాదనియు, నాపె సోదరి యైన గణపాంబనియు పరిశోధనలవలన దేలుచున్నది. రుద్రాంబికయు గణపాంబామహాదేవియు నేక కాలమున పరిపాలించుటజేసియు, గణపాంబ కేవల మొక మహా మండలేశ్వరుని దేవియై యుండ, రుద్రాంబిక, మహారాజ్ఞియై, చక్రవర్తినియై, త్రైలింగ సామ్రాజ్యము నంతయు నేకచ్ఛత్రముగ బరిపాలించుటయు, నీ యపోహ జనించుటకు గారణము లయ్యెను. ఇందులకు గణపాంబదేవి చారిత్రము దెలియకపోవుట యేకారణ మయ్యెను. చరిత్ర దెలిసిన యాంధ్రులకు సైతమీ గణపాంబ చిరపరిచితురాలు గాదు. కావున నామె చరిత్ర మిచ్చట వివరించుట యుక్తము. గణపాంబ, కాకతి గణపతి దేవునకు రెండవ కూతుఱు. షట్సహస్రవిషయమును ఆంధ్రదేశభాగము నేలిన, కోటకేతరాజు మనుమడైన బేతరాజీమె భర్త. షట్సహస్రవిషయము, తెనుగున