పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నంటుకొని, నైజాముగారి పరిపాలనలో నున్నది. పరిటాలకడ నున్న కొండలకు పూర్వమునుండి వజ్రపుగనులని ప్రసిద్ధిగలదు. ప్రఖ్యాతి జెందిన గోల్కొండవజ్రాలని బేరు, పరిటాల గనులవలన గలిగియుండెను. ఇప్పటికిని పరిటాలకడ కొండలు మార్కోపోలో వ్రాతలకు సరిపోవునట్లుగా నువ్వెత్తుగలేచుచు నేటవాలుగ నుండును. ఆకొండ లన్నియు భీతావహములయి యొకప్పుడు త్రవ్వబడినట్లును చిహ్నములను నేటికి జూపుచున్నవి. పరిటాల గాక, కర్నూలు మండలములో వజ్రకరూరని మరియొక యూరుగలదు. అచ్చటగూడ వజ్రపు గనులుండెననియు బ్రసిద్ధి గలదు. మొత్తముమీద మోటుపల్లి రాజ్యమున కిరుకెలంకుల నున్న మండలములు వజ్రాలకు బ్రసిద్ధి కెక్కియుండుట వలన మార్కోపోలో తానాకాలమున విన్న కథలను విశ్వసించి మనోహరముగా వర్ణించినాడు.

మార్కో వర్ణించిన రెండవ విషయము, ఇచ్చట నేయబడుచుండిన మంచు తెరలవంటి రవసెల్లాలు. ప్రాచీనకాలము నుండియు, నాంధ్రదేశములోని బూర్వభాగము బట్టల నేతకు పేరువడిన ట్లనేకమంది ప్రాచీన గ్రంథకారులు వచించియున్నారు. ఈ సెల్లాల నేతపరిశ్రమయు, రంగు లద్దకములును మొన మొన్నటి వఱకును, ఆంగ్లేయులు సుస్థిరముగ వారి రాజ్యమును బాదుకొలుపు వఱకు వర్థిల్లుచుండెను. ఈ దేశమున విశేషముగా, గొఱియలు, మేకలు, నున్నవని మార్కో వ్రాయుచున్నాడు. ప్రాచీనకాలమునాటి యేదేవా