పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగమునకు సయితము దిగుచుండును. ఱాళ్ళనడుమను చిక్కుకున్న మాంసపు ముక్కలను గ్రుచ్చుకున్న ఱాళ్ళతోసయితమాగ్రద్దలు తన్నుకొనిపోవుచు, నేకొండకొననో, నేచెట్టుమీదనో గూటిలోపిల్లల యాహారమునకై పెట్టుచుండును. గ్రద్దలు వ్రాలుటచూచి, జనులు, ఱాళ్ళుగ్రుచ్చుకొనిన మాంసపుముక్కలకై ఆపక్షులను తరిమివేసి యామాంసపుముక్కలను దెచ్చుకొందురు. అందు తఱచుగా నితర ఱాళ్ళతో పాటు వజ్రములుగూడ నుండును. ఈకొండలోయల యడుగున, వజ్రములిట్లు కుప్పతిప్పలుగా బడియుండుట నిజముగా నాశ్చర్యకరమైన విషయము. కాని కొండలోనికి వజ్రములకై ప్రాణములపై నాశవీడి యెవడును చనజాలడు. ఇచ్చటి సర్పములు మనుష్యులను సయితము మ్రింగివేయగలవు. వజ్రములకై జనులు, గ్రద్దల గూండ్లకడ కేగి వాటిరెట్టలను వెదకి యందు రత్నములను గాంచుటయు గూడగలదు. మాంసపు ముక్కలను, అందు చిక్కుకొనిన ఱాళ్ళతోపాటు, పక్షులు తిని ఱాళ్ళను జీర్ణము చేసుకొనలేక రెట్టలో కలిపి విడుచును. ఒకప్పుడు పక్షులను పట్టుకొని జనులు రత్నములకై పొట్టలజీల్చి చంపుదురు. వాటిలోగూడ వజ్రములు లభించుటయుగలదు.

"పెద్దపెద్దవజ్రములు (ముటఫిలి) మోటుపల్లిసీమయందు తప్ప నింకెక్కడను లభింపవు. మన పాశ్చాత్య దేశములకు గొనిరాబడునవి ఇచ్చటివారు మంచి వాటిని యేరుకొన మిగిలిన రెండ వరకపు సరకులనినమ్మును. ఇచ్చటిరాజులు, శ్రీమంతులు