పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోలో, పాండ్యదేశమును జూడ నేతెంచినపుడు పరిపాలించు చుండిన సుందర పాండ్యుడితడే! అప్పటి కితడు పాండ్యభూపతులలో జేష్టుడు, ఇతనిరాజధాని, మథురానగరముగాక, కాయల్ పట్టణమో, కావేరిపట్టణమో అయియుండినట్లు తోచుచున్నది. ఇతనికాలముకడు శాంతిప్రదమై, సుఖదాయకమై యుండినట్లును, ఈతనికీర్తి దిగంత విశ్రాంతియై యుండినట్లును, చరిత్ర వాకొనుచున్నది. చీనాదేశమునుండి వచ్చిన రాయబారులితని కొలువున దర్శనమునకై మొగసాలలవేచియుండువారట! సింహళ ద్వీపమునేలు, విక్రమ బాహు, పరాక్రమ బాహులు ఇతనిధాటికినిల్వజాలక సామంతులయి కప్పముగట్టుచుండిరి. ఇతనిరాయబారులు, మంగోలియా దేశాధీశుడగు జమాలుద్దీను కొలువునకుగూడ బంపబడునట్లు మార్కొపోలో వచించుచున్నాడు.

ఇట్టి రాజుపరిపాలించుమన పాండ్యరాజ్యమును, ఆరాజ్యమున్న మాబారును మార్కొపోలో విపులముగ వర్ణించినాడు. కులశేఖరుని, న్యాయపరిపాలన ప్రజలనాగరికత, కాయల్ పట్టణ సముద్రవ్యాపారము, ముత్యపుచిప్పల వేల, మున్నగు వాటిని మార్కొ చక్కగా వర్ణించినాడు. పాండ్యరాజ్యముననున్న సమయమున క్రైస్తవసిద్ధుగు ధామసునుగూర్చి మనమార్కొపోలో వినియుండెను. థామస్‌సిద్దుని సమాధి యిపుడు చెన్నపట్టణము నకుసమీపముగానున్న (సెయింటు ధామస్ మవుంటు) థామస్ సిద్ధునికొండను సందర్శింప బయి