పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మున, హొయసల రాజులు, ఉత్తరమున కాకతీయులు, తెలుగుచోడ వంశజులు ప్రక్కలో బల్లములై యుండుటచేతను, అంత:కలహముల చేతను, రాజు లప్రయోజకత్వము వలనను చోళరాజ్యము విచ్ఛిన్నమై పోయెను, పదమూడవ శతాబ్దారంభము నుండియు, విజృంభింప నారంభించిన, మధురానగర పాండ్య రాజులప్రాభవము, ఆశతాబ్దాంతము నాటికి మహోచ్చదశకువచ్చెను. క్రీ.శ. 1251-మొదలుకొని యించుమించుగా 1275 వఱకును బరిపాలించిన, జటావర్మ మొదటి, సుందరపాండ్యదేవుడు, పాండ్య రాజ్యమును, పినాకినీ నదీపర్యంతము వ్యాపింపజేసి, హొయసల రాజులకడ నుండియు, తెలుగుచోడనంజుల కడనుండియు గప్పములు గైకొని దిగ్విజయము చేసి తిరిగి వచ్చుచు శ్రీరంగమున పట్టాభిషేకము చేసుకొనెను. తన రాజధానియందు సువర్ణ తులాభారమును తూగెను. ఈతనితో నితని సోదరులు మువ్వురో నల్గురో, సోదరునికూడ కలిసి నేకకాలమున పరిపాలనము చేసియుండిరి. జ్యేష్టుడు రాజ్యాభిషిక్తుడుగను, మిగిలిన సోదరులు, మహా మండవేశ్వరులుగను పరిపాలించుచు, నందఱు నొక్కరీతిగానే రాజ్యచిహ్నముల నుపయోగించు కొనుచుండుట పాండ్యరాజవంశ సంప్రదాయముగా గానుపించుచున్నది. జటావర్మకువెనుక, రాజ్యాభి షిక్తుడైనవాడు మారవర్మ కులశేఖర సుందరపాండ్య దేవుడు. ఈతడించుమించుగా క్రీ.శ. 1268 మొదలుకొని 1311 వఱకును బరిపాలించియుండెను. మార్కొ