పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డును. ఇటలీదేశమున వెనీషియానగరమున పండ్రెండవ శతాబ్దమున 'పోలో' యని యింటిపేరుగల, ప్రసిద్ధవర్తకుల కుటుంబము మొకటి యుండెను. ఆకుటుంబమునందు క్రీ.శ. 1254 వ సంవత్సరమున మన కధానాయకుడగు మార్కోపోలో జన్మించెను. మార్కో, పితామహునిపేరు ఆండ్రియాపోలో. ఆతనికి ముగ్గురు కుమారులుండిరి. వారిలో జ్యేష్టుడు మాఫియో. రెండవవాడు నికోలో ఇతడే, మనమార్కోకు జనకుడు. మూడవవానిపేరు మార్కో. మాషియోపోలో, నికోలోపోలోయును గలిసి, తుర్కీ రాజధానియైన కానిస్టాంటినోపిలు (స్టాంబూలూ అని తుర్కీవారు పిలుతురు) నగరమున, సమిష్టిగా వ్యాపార మారంభించిరి. మార్కోమాత్రము సోదరులతో కలియక, సొంతముగా నాయూరనే వర్తకము చేసుకొనుచుండెను.

ఇట్లుండ, క్రీ.శ. 1260 వ సంవత్సరమున వ్యాపారార్థమై నికోలో, మాఫియో పోలోలు, నల్లసముద్రమును దాటి ఉత్తరాభిముఖులై క్రిమియాద్వీపమునకు జనిరి. ఆ ద్వీపమునకు ప్రధానరేవు పట్టణమును, రాజధానియు, సోల్డియా నగరమున, మనపోలో సోదరులు వర్తకమువలన విశేష లాభమును గడింపగలిగిరి. అంతట వచ్చిన లాభముతో, నమూల్యములయిన వస్తువులను, రత్నములను అపూర్వము లయిన యితరములను గొని యింకను విశేషలాభాపేక్షతో, నుత్తరదిశగా, తార్తారరాజధానికి జనిరి. తార్తారదేశాధీశుడీ