పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

V

మానమైన ప్రజ్ఞతో నేలిన కాలమది.జైన మతము విధ్వస్తము గావింపబడి, వీరశైవము ప్రతిష్టింపబడిన తరుణ మది. చిల్లర, చిల్లర రాజ్యములు, అణగద్రొక్కబడి, ఆంధ్రదేశమంతయు నేకచ్ఛత్రాధిపత్యము క్రిందకు గొని రాబడిన కాలమది.కులభేదములును, వైషమ్యములును బాటింపక, క్షత్రియ, చతుర్థవంశజులు, నొక్కటిగా కలసిపోయిన కాలమది. ఆంధ్రుల సముద్రవ్యాపారవైభవము, దేశదేశాంతరముల మారుమ్రోగిన కాలమది.

మరి రెండు శతాబ్దములనాటికి దేశమున గలిగిన మార్పులవలన, కాకతీయ సామ్రాజ్యమంతరించిపోయెను. దానిస్థానమున భామినీ రాజవంశము, తురుష్క సామ్రాజ్యమును నెలకొల్పియుండెను.దక్షిణాపథమంతయు, ఇంచుమించుగా, పూర్వాంధ్రదేశము తప్ప, మహమ్మదీయుల వశమయ్యెను.పూర్వాంధ్రదేశము కొంతకాలము రెడ్ల పరిపాలనము క్రిందను, మరికొంతకాలము, ఒడ్దెగజపతిరాజుల క్రిందను పరిపాలింపబడుచుండెను. కృష్ణకు దక్షిణమున గల దేశముపై సర్వాధికారము నెఱపుచు, రెండున్నర శతాబ్దముల కాలము హిందూమతమును, సంఘమును,హిందువుల స్వాతంత్ర్యమును సంరక్షించుకొఱకు విజయనగర సామ్రాజ్యము వెలసియుండెను. ఆ సామ్రాజ్యపు వైభవప్రారంభదశయందు, యిమ్మడి దేవరాయలు చక్రవర్తియై పరిపాలించి యుండెను. అతనితో నెయ్యము నెఱపుటకు, పారశిక సుల్తాను ఖాకాని సయ్యద్‌