పుట:Aananda-Mathamu.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

పదియవ ప్రకరణము

41


నియునైన పృథ్వీ ప్రాంతమును, కానన నగమును, నదియొక్క శోభాకాంతినిఁ జూచి, వానిమనస్సు సముద్రము చంద్రోదయముచే ఆహ్లాదితమై హాసము చేయునట్లు విశేషస్ఫూర్తినిఁ దాల్చెను. భవానందుడు హసన్ముఖుఁడై వాఙ్మయ ప్రియసంభాషి యయ్యెను. ఏవేవోవిషయములను జెప్పుట కుత్సుకుఁ డయ్యెను. ఎన్నెన్నో ప్రయత్నములు చేసి చూచెను, మహేంద్ర సింహుఁడు మాటలాడ లేదు. అంత భవానందుఁడు తనంతట తానే పాడుటకుఁ దొడంగెను. ఎట్లన——

పల్లవి

వన్డే మాతరం.

అనుపల్లవి

సుజలాం సుఫలాం మలయజ శీతలాం,

సస్యశ్యామలాం మాతరం,

మహేంద్రుఁడు, సంగీతమును విని విస్మితుఁ డాయెను. ఏదియు బోధకాలేదు. కావున, “సుజలా, సుఫలా, మలయజ శీతలా, ఇట్టి గుణవిశిష్టురా లైనమాత యెయ్యది ?" యని ప్రశ్న చేసెను.

భవానందుఁడు, ఉత్తర మీయక మరల సంగీతమును మొదటనుండి స్వరయుక్తముగ పాడుటకుఁ బ్రారంభించెను.