పుట:Aananda-Mathamu.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

ఆనందమఠము


భవానంద—— మీరు నా ఉపకారమును గ్రహించిన నేమి, గ్రహింపకపోయిన నేమి, ప్రత్యుపకారము చేసిననేమి, చేయక పోయిన నేమి, మీయిష్టము. మీరు నాతో వచ్చితిరేని మీ భార్యను కొమార్తెను చూపఁగలను.

మహేంద్ర——(భవానందుని ముఖమునుజూచి ఆశ్చర్యముతో) అదెట్లు?

భవానందుఁడు మారాడక పోవుచుండెను. మహేంద్రుడు చేయునది లేక వాని వెంబడి పోవుచుండెను. పోవునపుడు తనలో “వీ రెట్టి దొంగలబ్బా!” అని తలంచుకొనెను.


పదియవ ప్రకరణము

మహేంద్రుడు భవానందునితో భాషించుట

ఆజ్యోత్స్నా మయి యైన రాత్రియం దిర్వురును నిశ్శబ్దముగా ప్రాంతరమును దాఁటిపోయిరి. మహేంద్రుఁడు విన్నఁ బోయిన వాఁడును, శోకాతురుఁడును, గర్వితుఁడును, కొంచెము కౌతూహలావిష్ణుఁడునై యుండెను.

భవానందుఁడు, అన్యభావమును ధరించెను. వాడు స్థిర మూర్తియైన ధీర ప్రకృతిగల సన్న్యాసిగా నుండలేదు. ఆసైన్యాధ్యక్షుఁ డైన ఘాతుకుఁడుగాఁ గనఁబడ లేదు. కొంచెము సేపునకు ముందు మహేంద్ర సింహుని తిరస్కారము చేసిన యహంభావమును లేదు, జ్యోత్స్నామయియును శాంతశాలి