Jump to content

పుట:Aananda-Mathamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువదితొమ్మిదవ ప్రకరణము

159

నునియందు కాలి భస్మమగుఁగాక. ధర్మము పోయెను, ప్రాణము దక్కెను. ఇప్పటికి నాలు గేండ్లుగా ప్రాణము తడబడుచున్నది. పోదు, ఇఁక నిలువదు; దాహము! కల్యాణి! దాహము! జ్వాల! కాల్చి వేయుద మన్నను కట్టెలు లేవు, ప్రాణము పోవుచున్నది, నాలుగేండ్లు సహించితిని, ఇంక సహింపఁజాలను, నీవు నాదాన వయ్యెదవా?

కల్యాణి —— సంతానుల ధర్మమందు ఇంద్రియము పరవశ మైనచో దానికిఁ బ్రాయశ్చిత్తము మరణమని నీవు చెప్పినావే, యది నిజమేనా?

భవానంద —— నిజమే.

కల్యాణి —— అటులైనచో నీకుఁ బ్రాయశ్చిత్తము మరణమో?

భవానంద—— నాకుఁ బ్రాయశ్చిత్తము మరణ మొక్కటియే.

కల్యాణి —— నేను నీ యిష్టార్థమును నెఱవేర్చినయెడల నీవు చచ్చెదవా?

భవానంద —— నిశ్చయముగాఁ జచ్చెదను.

కల్యాణి —— నీయిష్టార్థము నెఱవేఱని యెడల?

భవానంద —— అప్పటికిని మరణమే నాకుఁ బ్రాయశ్చిత్తము. ఏలనఁగా, నాచిత్తము ఇంద్రియవశమై యున్నది.

కల్యాణి —— నీ యిష్టార్థమును దీర్పఁజలను; నీ వెపుడు చచ్చెదవు?

భవానంద —— రాఁగల యుద్ధమునందు.

కల్యాణి —— అట్లయినచో పో. నాబిడ్డను పంపెదవా?