Jump to content

పుట:Aananda-Mathamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

ఆనందమఠము

భవానంద —— నీవు పునర్వివాహము చేసికొందువా? నీకు పునర్జన్మ మైనది.

కల్యాణి —— నాబిడ్డను తెచ్చి విడువుము.

భవానంద —— తెచ్చి విడిచెదను, మరల వివాహము చేసికొందువా?

కల్యాణీ —— నిన్నేనా?

భవానంద —— చేసికొనెదవా!

కల్యాణి —— నిన్నేనా?

భవానంద —— అట్లే యనుకొనుము.

కల్యాణి —— సంతానధర్మ మెచ్చట నుండును?

భవానంద —— అతలజలమునందు

కల్యాణి —— ఈ మహావ్రతమో?

భవానంద —— అతలజలమునందు.

కల్యాణి —— ఎవరికొఱకై దీని నంతయు నతలజలమున ముంచెదవు?

భవానంద —— నీకొఱకే. కల్యాణీ! మనుజుఁడే గాని, ఋషియేగాని, సిద్ధుఁడేగాని, దేవతయేగాని, చిత్తము అవశమైనది. సంతానధర్మము నాప్రాణమైయున్నది. అయినను, నేఁడు చెప్పెద వినుము. నీవు నాప్రాణాధిక ప్రాణము. నే నెన్నఁడు నీకుఁ బ్రాణదానమును జేసితినో నాఁటనుండి నేను నీపాదమూలమున విక్రీతుఁడనై పడి యున్నాను. ప్రపంచమునందిట్టి రూపరాశి యున్నదని తెలియదు. ఇట్టి రూపరాశిని గన్నులతో నెన్నఁ డైన జూడఁగలనని తెలిసి యుంటి నేని, సంతానధర్మమునే కైకొని యుండను. ఈధర్మము ఈసంతా