142
ఆనందమఠము
మునకై మంచి బియ్యము నెయ్యి గోధములు మొదలగువానిని బండ్లపై తెప్పించుచుండిరి. దానిం గని నోట నీరూరి నూతనముగ సంతానులైన మాలలు ఆబండ్ల నడ్డగించిరి. అయినను, వారు థామసుయొక్క సిపాయీల చేత నుండిన తుపాకుల దెబ్బల కోర్వక, వెన్నిచ్చి పాఱిరి. కేష్ట౯ థామసు తత్ క్షణమే కలకత్తాకు వ్రాసిన దేమనఁగా:——
ఈదినము నూట యేఁబది యేడ్గురు కంపెనీ సిపాయీలను దీసికొనిపోయి పదునాల్గు వేల నేడునూర్ల రాజవిద్రోహులను పరాజయ మొందించితిని. ఈ రాజవిద్రోహులలో రెండు వేల నూటయేఁబది ముగ్గురు హతులైరి; వేయియు నిన్నూటముప్పది ముగ్గురు గాయ మొందిరి: ఏడ్గురు ఖైదీలుగాఁ జిక్కిరి. అని వ్రాసెను —— ఇందు తుదిమాటమూత్రమే సత్యము. కేష్ట౯ థామసు, ‘బ్లేనహిం’ లేక రసవాతుని యుద్ధమునందు జయము కల్గినదని తెలిసికొని గడ్డమును మీసమును దువ్వుకొనుచు నచ్చటచ్చట తిరుగుచుండెను. మఱియు డనివర్తు దొరతో, ఇంకేమి? రాజ విద్రోహము నివారణ మాయెను; నీపుత్ర కళత్రములను కలకత్తానుండి రప్పించుకొనవచ్చు నని హెచ్చరిక చేసెను. డనివర్తు, ‘అటులనే కానిండు; తామిచ్చట నింకను పదిదినము లుండుఁడు; దేశ స్థితి యింకను గొంచెము స్తిమితమునకు రానిండు, తదనంతరము నాభార్యయు పిల్లలు వత్తు’ రనియెను. డనివర్తునింట చాల గొఱ్ఱెలును, కోళ్లును నుండెను. ఉత్తమమైన పన్నీరును నానావిధము లగు అడవిపక్షులును మృగములును నతనిభోజనమునకు సిద్ధ మగుచుండెను. గడ్డము పెంచినవాఁ డొక బబ్బర్చి