Jump to content

పుట:Aananda-Mathamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇరువ దేడవ ప్రకరణము

141

కులను బారు చేసికొని సంతానుల వధకై వెడలిరి. అయినను, సంతానులసంఖ్య యెక్కువగా నుండి నదేగాక, వారు అజయ్యులై యుండిరి. కేష్ట౯ థామసుయొక్క సైనికులు, కోతకాలములో కొడవలికి దొరికిన పైరువలె కత్తరింపఁబడిరి. హరిహరిధ్వనిచే కేప్ట౯ థామసుయొక్క చెవులు చెవుడు వడెను. ఈవిధముగ 1776-వసంత్సరమునందు వీరభూమిలో సంతానులు ప్రసిద్ధి కెక్కిరి.


ఇరువదేడవ ప్రకరణము

ఆకాలమున కంపెనీవారిచే పట్టుపనిచేయు కార్ఖానాలు స్థాపింపబడి యుండెను. శివగ్రామంబున నొకకొఠారుండెను. డనివర్తుదొర అనువాఁ డాకొఠారునకు ఫ్యాక్టరు (Factor) అనఁగా అధ్యక్షుఁడై యుండెను. కొఠారుల సంరక్షణ విషయమునందు తగిన యేర్పాట్లు కలిగియుండెను. డనివర్తుదొర యెట్లో తన ప్రాణరక్షణము చేసికొని వసించుచుండెను. అయినను, వాఁడు తనభార్యను బిడ్డలను కలకత్తాకుఁ బంపి యుండెను. ఇట్లుండినను వానికి సంతానుల యుపద్రవము తప్పలేదు. ఈసమయమున నాప్రదేశంబునకు నాలుగైదు పటాలములతోడ కేష్ట౯ థామసు విజయముచేసి యుండెను. కొత్తగాఁజేరిన మాలలు మొదలగు నీచజాతి సంతానులు కొందఱు పరధనాపహరణంబునందుత్సాహులై యుండిరి. కేష్ట౯ థామసుదొరవారు సైన్య