ఇరువదినాలుగవ ప్రకరణము
121
తోఁగూడ ధర్మాచరణ మాచరించుటకై వచ్చి యున్నాను’ అనెను.
శాంతి యొక్క గంభీరవాణిని విని, యామె యున్నత గ్రీవమును, స్ఫీతవక్షఃస్థలమును, కంపితాధరమును, అశ్రుప్లుత నేత్రములను గాంచి సత్యానందుఁడు అమితానందంబును బొంది శాంతినిఁజూచి, “నీవు సాధ్వివి. అయినను, తల్లీ! పత్ని కేవలము గృహధర్మమున సహధర్మిణిగాని, వీరధర్మమున రమణి లేదుగదా?’
శాంతి —— ఏమహావీరుఁడు అపత్నీ కుఁడై వీరుఁడై యుండెను? రాముఁడు సీత లేకుండిన వీరుఁ డగుచుండెనా? అర్జునునకెందఱో భార్య లుండిరి. భీమున కెంతబలమో యందఱు పత్ను లుండిరఁట! ఎంతయని చెప్పుదును? తమకుఁ దెలియని దేమున్నది?
సత్యానంద —— నీవు చెప్పునది నిజము; అయినను, రణరంగమున నేవీరుఁడు భార్యాసహితుఁడై యుండెను?
శాంతి —— అర్జునుఁడు యాదవసైన్యముతో నంతరిక్షమునఁ బోరునపు డాతని రథమును నడపినవారెవరు? ద్రౌపది సమీపమున లేకుండిన, పాండవులు కురుక్షేత్రమునందు యుద్ధము చేయుదురా?
సత్యానంద —— వారట్టుండవచ్చును. సామాన్యులగు మనుజుల మనస్సు స్త్రీలయం దాసక్తమై కార్యభంగమగుచున్నది. ఆ హేతువు చేత సంతానుల వ్రతమందు స్త్రీలతోడ నేకాసనంబునం గూర్చుండరా దనుపద్ధతి యొకటి యేర్పడి
.