పుట:Aananda-Mathamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞప్తి

ఈ “ఆనందమఠ" మను గ్రంథమును బంగాళదేశము నందు ప్రసిద్ధోపన్యాసలేఖలకు లని ప్రఖ్యాతిగాంచిన శ్రీ బంకించంద్రచట్టోపాధ్యాయులవారు బంగాళీభాషయందు రచియించిరి. శ్రీ బిపినచంద్రపాలుగారు 1907-వ సంవత్సరమున ఈ రాష్ట్రమున స్వదేశీప్రచారము సాగించుచున్నపుడు రాజమహేంద్రవరమున వారిని కలిసికొంటిని. వారు వెంటనే కలకత్తావెళ్లి బెంగాళీ ఆనందమఠ ప్రతి పుచ్చుకొని తగువారిసహాయముచే నన్ను తెనుగుతర్జుమా చేయమని కోరినందున అట్లే చేసితిని. మరల చెన్నపట్టణము చేరగనే తెలుగుతర్జుమా కాకితముల ఓ. వై. శ్రీ దొరస్వామయ్య కిచ్చి సాఫువ్రాయమని కోరితిని. వారు కర్ణాటకముస శ్రీ బి. వేంకటాచార్యులచే ప్రచురింపఁబడిన ప్రతినికూడ సహాయము పుచ్చుకొని సరిచూచియిచ్చిరి.

కథాసారాంశము.

1. ఈ గ్రంధమునందు బంగాళాదేశమును ఆంగ్లేయు లుద్ధారముచేసినవిషయము లుదాహృతములై యున్నవి.

2. స్త్రీలు, కొన్ని సమయములయందు పురుషులకు సహకారిణులుగ నుందురు. కొన్ని సమయములయందు కారు.

3. సమాజక్షోభము ఆత్మపీడనమాత్రము. రాజవిద్రోహులు ఆత్మఘాతుకులు.