పుట:A P Archives Kaifiyats R No 1079.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కయిఫియ్యతు మం. యినగల్లు వ. మింజనంపాడు వ గొ ట్టిపాడు వ. గన్నెపూడి, వ. గొల్లపూడి, వ. ముల్కిపూడి, వ. తాతపూడి పర్గణావిని కొంత ముప్పాతిక ముట్టు - పెబిరెవరి 8 తా 1813 సంవత్సరం -

యినగల్లు కథ

కయిఫియత్తు మ యినగల్లు పరగణె వినుకొండ రాజ మహారాజు వెంకటగుండారావు సర్కారు మృుర్తజాన్నగరు 1222 పసలీ -

ఈ గ్రామానికి పూర్వం నుంచిన్నీ యినగల్లు అనే వాడిక వున్నది - పూర్వం రుద్రహంశా సంభూతుడైనటువంటి ముక్కంటి మహారాజుగారు కలియుగ ప్రవేశమయిన రెండు సంవత్సరముల మీదటను కాశీ నుంచీ వచ్చిన బ్రాహ్మణులకు 700 యేడునూరు అగ్రహారములు ధారాగ్రహితము చేసినవారై మరిన్నీ సప్త ఋషి సంఖ్Yఅ గ్రామాదులని సప్త మహా ఋషులకు ప్రీతి గాను యేడు గ్రామాదులు అగ్రహారములు యిచ్చినారు-

అవి యయ్యని యంటేను వసిష్ఠ స్థానముగాను వుప్పుటూరు, ఆత్రేయ స్థానంగాను కారంచేడు, గౌతమ స్థానం గాను గుంటూరు, భారద్వాజ స్థానంగాను సొలస, విశ్వామిత్ర స్థానంగాను కారుచోలు, కశ్యప స్థానంగాను వంగిపురము, జమదగ్ని స్థానం గాను యినగల్లు యీ ప్రకారము గా కలియుగం ప్రవేశించిన 20000 సంవత్సరముల మీదట పూర్వసముద్ర తీరానను ముక్కంటి మహారాజుగారు బ్రహ్మప్రతిష్ఠ చేసి యీ యినగల్లు జమదగ్ని స్థానంగాను అ