పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రలోకోక్తి చంద్రికాశేషము.

2404. దొంగకు అందరిమీద అనుమానమే.

The thief suspects every one.

             A thief thinks every man steals.(Dealsh)*

2405. దొంగకు దొంగ బుద్ది, దొరకు దొర బుద్ది.

A thief has a thief's thoughts, a gentleman has gentleman"s thoughts.

2406. దొంగను దొంగ యెరుగును.

A thief is knon by a thief. A thief knows a thief, as wolf knows a wolf.

2407. దొంగ వస్తానని ముందు చెప్పి వుంటే, సాక్షులను సంపాదించి వుందును.

If the thief had said before that he was coming, I would have obtained witnesses.

2408. దొంగవాడి దృష్టి మూట మీదనే.

The thief's eye is upon the bundle.

2409. దొంగిలించేటంత దొరతనము వుండగా, అడిగేటంత అన్యాయముకు లోబడుతానా.

When I have such power of stealing shall I subnmit to the injustice of asking?

               Said by a thier.

2410. దొరలేని మూకలు.

Troops without a leader.


                *Try tavenker  Hyerixpand stlaeler
                                 (44)