పుట:A Collection of Telugu Proverbs translat(1).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రలోకోక్తిచంద్రికా శెషము

2377. తిట్టేనోరు కుట్టినా వూరకుండదు.

An abusive mouth will not be quiet though you sew it up.

                              (See No.1086.)

2378. తిరిపెము యెత్తేవారికి పెరుగు అన్నముకు కరువా.

Will one who receives alms lack rice and curds?

2379. తిరునాళ్ళకు పోతావ, తిండికె పోతావా.

Are you going for the festival (lit, holidays) or for the feast/

                         (See No.1981)

2380. తుపాకీ కడుపున ఫిరంగీ పుట్టినట్టు.

Like a cannon being born in the belly of musket.

            Great things from small.

2381.తురక వీధిలో సన్యాసి భిక్ష.

A Sanyasi's arms in Mussluman street.

Not the place of him to go to.

2382. తెంపుల తాళ్ళు, చిల్లుల కడవ.

A rope in pieces, a pot with holes.

               Useless instruments.

2383. తెగించిన వానికి తెడ్డే ఆయుధము.

To the bold man his ladle is a weapon/

             (See No.1107)

2384. తెలిసిన వారికి ముందరనే వున్నది మోక్షము.

Salvation awaits the wise.

                                     (40)