పుట:A Collection of Telugu Proverbs.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రలోకోక్తిచంద్రిక

416. ఎవరి వెర్రి వారికి ఆనందము.

Every man’s folly is pleasure to himself.
Fools are pleased with their own blunders.

417. ఎవరు యేమి చేశినా, యింటికి ఆలు అవుతుందా, దొంతికి కడవ అవుతుందా.

Will any service rendered by another be as a wife to the house or a pot for the pile?
Said by a man whose wife has died or gone astray.


418. ఏకాదశా బ్రాహ్మణుడా అంటే, కాలే కొరివి యెగసన తోస్తావా అన్నాడట -ద్వాదశా బ్రాహ్మణుడా అంటే, ఆపదలు కాపురాలు చేస్తావా అన్నాడట.

“Is it the fast O Brahman?” [asked one] “Will you stir up the fire?” [replied the Brahman already irritated by fasting]. “Is it the festival?” [said the first]. “Do troubles last for ever?” [answered the Brahman, delighted at the prospect of being fed.]
Welcome and unwelcome intelligence.

419. ఏ కాలు జారినా, పిల్లకే మోసము.

Whichever leg slips there is danger to the child.
(See No. 129)

(76)