పుట:A Collection of Telugu Proverbs.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

TELUGU PROVERBS.


1637. బ్రహ్మ వ్రాసిన వ్రాలు తిరుగునా.

Will the writing written by Brahma fail ?
(see No.1344.)

1638. బ్రహ్మాస్త్రానికి తిరుగు లేదు.

There is no turning to a Brahmastra.
Brahmâstra is the fabulous weapon of Brahma.
Said of anything which is irresistible.

1639. బ్రాహ్మణుని చెయ్యీ యేనుగ తొండమూ వూరకుండవు.

A Brahman’s hand and an elephant’s trunk are never quiet.

1640. బ్రాహ్మణుని మీది సంధ్యా కోమటి మీది అప్పూ నిలవదు.

The prayers due by a Brahman will not remain [unsaid ], and the debt due by a Komati will not remain [unpaid].

1641. బ్రాహ్మణులలో చిన్న, బెస్తలలో పెద్ద.

The youngest among Brahmans, the eldest among fishermen.
Are made drudges.

1642. బ్రాహ్మణులలో నల్లవాణ్నీ మాలలలో యెర్రవాణ్నీ నమ్మరాదు.

You should not trust a black man among Brahmans, or a fair man among Pariahs.

భ.

1643. భక్తిలేని పూజ పత్రి చేటు.

Worship without faith is a mere waste of flowers.
Flowers are used in offerings.

( 285 )