పుట:A Collection of Telugu Proverbs.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.

1397. పరుగెత్తుతూ పాలు తాగేకన్నా, నిలుచుండి నీళ్లు తాగడము మేలు.

It’s better to stand and drink water, than to run and drink milk.
A comfortable berth with a moderate salary, is better than a bad situation with a larger income.

1398. పరుగెత్తేవాణ్ని చూస్తే తరిమే వాడికి లోకువ.

The man that runs away, is inferior to the man who follows him.

1399. పరువిచ్చి పరువు తెచ్చుకో.

Give honor, get honor.

1400. పలకని వాండ్లతో పది వూళ్లవాండ్లూ గెలవ లేరు.

The people of ten villages cannot overcome men who won’t open their mouths.

1401. పల్లము వుండే చోట నీళ్లు నిలుస్తవి.

Water lies in the low ground.
(See No.1308.)
Truth will out at last.

1402. పసుపు కొమ్ము యివ్వని కోమటి పసారమంతా కొల్ల యిచ్చినాడు.

As impossible as that a Kômati who would not give away a bit of turmeric should allow his whole store to be plundered.

1403. పసుపూ బొట్టూ పెట్టి పెండ్లికి పిలిస్తే వెళ్లక పెంకు పట్టుకొని పులుసుకు వెళ్లినట్టు.

When turmeric was rubbed on her feet and a mark put on her forehead and she was invited to the marriage feast she would not go, but afterwards she went with a broken pot to beg for broth.
Suffering by pride.

( 246 )