పుట:A Collection of Telugu Proverbs.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్రలోకోక్తిచంద్రిక.

1387. పనిలేని పాపరాజు యేమి చేస్తున్నాడంటే, కుందేటి కొమ్ముకు రేఖలు తీరుస్తున్నాడు అన్నాడట.

When they asked what idle Pâpa Râzu was about, they were told that he was carving lines on a hare’s horn.
(See Nos. 319, 1388, 1389. )

1388. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినాడట.

The barber without work shaved the cat’s head.
A man pretending to be fully employed.

1389. పనిలేని మాచమ్మ పిల్లిపాలు పితికినదట.

The jade who had nothing to do milked the cat.
(See Nos. 319, 1387, 1388.)

1390. పన్నెండు ఆమడ మధ్య బ్రాహ్మణుడు లేకపోతే యజ్ఞాము చేయిస్తాను అన్నాడట.

If there is no Brahman within a hundred miles, I’ll conduct the sacrifice.
An ignorant professor gets on well in the absence of the learned.

1391. పప్పన్నమంటే పది ఆమడ అయినా పరుగెత్త వలెను.

When we hear of D61 and rice we should run for it, even though it be hundred miles off.
(For Dâl see No. 183.)
Said of a greedy Brahman.

( 244 )