పుట:A Collection of Telugu Proverbs.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

TELUGU PROVERBS.

677. కొండకు వొక వెంట్రుక ముడి వేస్తే, వస్తే కొండే వస్తున్నది, పోతే వెంట్రుకే పోతున్నది.

If you tie a hair to a mountain, the mountain will come or the hair only go.
The possibility of great gain with the risk of little loss.

678. కొండ తలకింద బెట్టుకొని రాళ్లు వెతికినట్టు.

Like putting a mountain under one’s head and searching for stones.
(See Nos. 143, 2002)

679. కొండ తవ్వి యెలుకను పట్టినట్టు.

Digging up a mountain to catch a rat.

680. కొండతో తగరు పోట్లాడినట్టు.

Like a ram butting a mountain.
Great conceit.

681. కొండనాలికకు మందు వేస్తే, వున్ననాలుక వూడిపోయినట్టు.

When he applied medicine to the uvula, it took out the whole tongue.
(See Nos. 482, 846, 1567.)
The remedy is worse than the disease.

682. కొండను చూచి కుక్కలు మొరిగినట్టు.

Like dogs barking at a mountain.
(See No. 441)

(123)