పుట:ASHOKUDU.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూడవ ప్రకరణము

91

సిద్ధార్థుఁడు తనవినీల భ్రమరకుంతల దామమును దర వారి కెఱచేసి యుండెను. అచ్చటనే యా మహానుభావుఁడు తన యమూల్యాలంకారముల దీసి ఛందకున కిచ్చి వైచెను. యువ రాజగు బుద్ధ దేవుఁ డొక వ్యాధునిం బిలిచి తన యమూల్య పరిథానముల నాతనికిచ్చి యాతని జీర్ణవ స్త్రఖండమును దాను ధరించిన దివ్యస్థల మాస్థలమే. అచ్చట నే సిద్ధార్థుడు ప్రప్ర థమమున సన్యాసాశ్రమ గ్రహణముఁ జేసియుండెను. భగవానుడగు సిద్ధార్థుని గృహధర్మ త్యాగము, సన్యాసాశ్రమ స్వీకారము మొదలగు నద్భు తవిషయములు గూర్చి యుపగుప్తుఁ డశోకున కతిమనోహరముగ వర్ణించి చెప్పెను. ఆ పుణ్య చరిత్రమంతయు నాలకించి, పుణ్యస్మ తింగూర్చు నచ్చటి దృశ్యములం గాంచి యశోక సార్వభౌముఁడు ధర్మ భావావిష్ట హృదయుఁ డయ్యెను. వారాస్థలమునఁ గొన్ని దినములుండి యనంతరము పరమపూజ్యుఁ డగు బుద్ధ దేవుని చితాభస్మము పై నిర్మింపఁబడిన స్థూపమును దర్శించి ప్రదక్షిణ ప్రణామములం గావించి యచ్చట నుండి కాశీనగరమునకు బ్రమాణ మైరి. పిమ్మటఁ బ్రియదర్శనుఁడగు నశోకుని యానతిచే నచ్చట నతి సుందరంమగు నొక సింహ స్తంభము నిర్మింపబడి యెను.

రామగ్రామమునందలి పుణ్యస్మృతి స్థానములనన్నిటిని దర్శించిన పిమ్మట వారు కాశీనగరమునఁ బ్రవేశించిరి. ఆ నగరము ప్రకృతి రామణీయక దర్శన స్థానములలో సుప్రసిద్ధమైనది. ఆ నగరోపకంఠమునందలి సాలవనంబున శాంతి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/99&oldid=334959" నుండి వెలికితీశారు