పుట:ASHOKUDU.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

అశో కుఁ డు

దృప్తినొంద లేవు. ఆతనిరత్నాలంకారములనుగూడ గ్రహింపవలయునని యామెయాశ! విష ప్రయోగము చే నాతనిజంపి యాపాపాత్మురా లాతనియొద్దనున్న సర్వస్వమును హరించి వైచెను. ఆతని మృత దేహ మొక రహస్యస్థలమునఁ బూడ్చఁ బడియెను. కాని పాపము దాఁగ లేదు. ఆదుర్మార్గురాలు పట్టు వడియెను. అప్పటి శాసనానుసారముగా నామె మ్కుకును జెవులను గోయించి యరణ్య మధ్యములం దామెను విడిచి పెట్టుటకుఁ దీర్మానింపఁబడియె. ఆవిధముగనే కఠినశిక్ష యయ్యెను. ఆక్రూర రాక్షసి శరీరయాతన చేతను, క్షుద్బాధ చేతను, పిపాసాపీడ చేతను నల్లాడుచు నాయరణ్యమునంబడి వికృతనాదముతో నేడ్చుచుండెను. ఆ సమయమున ధర్మాచార్యుఁడగు నుపగుప్తుఁ డాయరణ్యమార్గమున బయలు దేరి యెచ్చటికో పోవుచు నావికటా ర్తనాదము నాలకించి యా దురాత్మురాలి చెంతకు వచ్చెను. అప్పుడా పాపాత్మురాలా యుపగుప్తు నింజూచి నిశ్చేష్టయయ్యెను. అంతలో నేయా మెకుఁ బూర్వ వృత్తాంతము జ్ఞప్తికివచ్చుటయు దారుణాభిమానముతో నాతనింజూ చి ఇప్పుడు నాయొద్ద 'కెందులకు వచ్చితివి? నీకొఱకు నిరీక్షించి యున్నప్పుడు నీవు రాలేదు. ఇప్పుడెందులకు వచ్చితివి? నాయీదుర్గతింజూచి పరిహసించుటకై వచ్చితివా?” అనియెను. ప్రప్రథమమున నామహాత్ముఁ డెట్టియుత్తరము నీయ లేదు. ఆనరఘాతిని తన నోటికి వచ్చి నట్లెల్లఁ బ్రేలి శ్రాంతయై యూరకుండెను. అప్పుడుపగు ప్తుఁడు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/94&oldid=334771" నుండి వెలికితీశారు