పుట:ASHOKUDU.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

73

సమయమున నాసభామధ్యమునం దించుక చలన చిహ్నము గానవచ్చెను. ప్రశాంతజల రాశి మృదు వాయు వేగ సంచలిత మైనట్లుండెను. సంయత చిత్తము లగుభిక్షు మండలములు భావతరంగవిలసితము లగుండెను. వారి నిర్వికార వదన ఫల కంబులనించుక కుతూహలము, నించుక విస్మయము, నించుక యధైర్యమును గానవచ్చుచుండెను. క్రమముగ నాచంచలత రంగములు ప్రబలము లగుచుండెను. సభాసదులెల్లరును లేచి నిలువఁబడిరి. అందఱ వదనములనుండియు "మహారాజు! మహా రాజు! " అనుమాట లస్పష్టస్వరముతో వెలువడియెను. అందఱును మహా రాజుదర్శనమునకై తొందరపడుచుండిరి.కాని మహారాజెక్కడ? మణి భూషణవి రాజితుఁడును గిరీటా లంకృతుఁడును దండ పాణియునగు మహారా జేఁడీ? ప్రతినిమిషమును నిరాశా విస్మిత మగుచుండెను. ఆ సమయమునం దొక ప్రాచీన భీఱు పార్శ్వస్థుఁడగు నవీన భిక్షుని వ్రేలితోఁ జూపుచు నందఱును “ఇతఁడే! అతని పార్శ్వమునందున్న యీతఁడే!” అని యస్పష్టస్వరంబునఁ బలుక నారంభించిరి. విలక్షణా కారుఁ డగునోక పురుషుఁడు సామాన్యాకృతితో నసంభ్రముఁడై యందఱకు నమస్కరించుచు నాశూన్యాసనము వైపునకు వచ్చుచుండెను. ఆ పీఠమును సమీపించి యాతఁడు ధర్మాచార్యుఁ డగుసభాపతి కభివాదనముం గావించెను. ధర్మాచార్యుఁ డగునుపగుప్తుఁ డప్పుడు లేచి యాతని నభినందించి యాశీర్వదించి తన పార్శ్వమునందున్న శూన్యాసన

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/81&oldid=334362" నుండి వెలికితీశారు