పుట:ASHOKUDU.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

అ శో కుఁ డు

కలిగెను. తరవాత నుపగుప్తుఁడు నౌక పై నుండి వచ్చుచుండె నని విని యశోకుఁడు గంగా తీరమునకు వచ్చి యతి వినయముతో నుపగుప్తునిం దర్శించి నమస్కరించి యాతనిం దనతోఁ తీసికొని వచ్చి యొక సుసంపన్నం బగు సౌధమునం దాతని విడియించెను.

ఉపగుప్తుఁడు నగరమునకు వచ్చులోపల నే మేమి చేయవలయునో మహా రా జిదివఱకే యాజ్ఞాపించి యుం డెను. రాజాజ్ఞ ననుసరించి యెల్ల కార్యములు ను సంపూర్ణము లయ్యెను. ఇఁక నుపగుప్తుడు వచ్చుటయే మిగిలినపని, అతికష్టము చే నదియును బూర్తియైనది.

నిర్దిష్ట సమయమున కెల్ల వారును సభామంటపమునకు వచ్చి యుండిరి. విశాల చంద్రశాలా మంటపమున భిక్షుగణము కూడియుండెను. ఏవంకఁ జూచినను గాషాయవస్త్ర ధారులును ముండితశిరస్కులు నగుబిక్షు లే యగపడుచుండిరి. ఆ బుద్ధసన్యాసులకు మధ్య భాగమున నుపగుప్తుఁడు కూర్చుండి యుండెను. అతని పార్శ్వముసందే మహా రాజపీఠము వేయింపఁ బడియెను. కాని యింకను నా పీఠము శూన్యముగ నే యుండెను. అక్కడి వారి దృష్టులన్నియు నాయుపగుప్తుని వంకను, నాశూన్య సింహాసనము వంకను బ్రసరించుచుండెను, అందఱు నుత్సాహముతో నుండిరి. ఆ యాలస్యము వారి యుత్సాహమున కంతరాయముం గూర్చుచుండెను. ఇట్టి

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/80&oldid=334354" నుండి వెలికితీశారు