పుట:ASHOKUDU.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము

71

కొందఱు రాజోద్యోగి యప రాధియనిరి. మణికొందఱట్టి వానిని మాయొద్దకుఁ బంపుటచే మీరే యపరాధులనిరి.

ఇట్టి భిన్నాభిప్రాయముల మధ్యమున మణికొందఱు “ చేసిన పని మంచిదా చెడ్డదా? ఆ నిమిత్తమునదోషి ఎవ్వఁడు? అను విషయం గూర్చే విచారింపవలసివచ్చినచో నప్పుడు కర్త యభిప్రాయమును దెలిసికొనవల సియుండును.” అని చెప్పిరి. ఏమైననేమి? ఈవిషయమున సూక్ష్మ విచారణ చేయుటకు మహాత్ముఁ డగునుప గుప్తుఁ డే సమర్థుఁడు. మహా రాజు పూర్వమునుండియు నుపగుప్తు ని మిగుల గౌరవించుచుండెను. మఱియు భిన్నాభిప్రాయుల గుభిక్షులతోఁ దనయభిప్రాయ మేకీ భవింపక పోవుటవలన నుపగుప్తుఁడు తన మతాధికార పదమును వదలుకొని పోయిన సంగతి కూడ మహా రాజగు నశోకునకుఁ దెలియును. ఆయుపగుప్తుఁ డిక్కడకువచ్చినచో నెల్ల విషయములను సాధింపవచ్చు ననియెంచి యశోకుఁ డాతనిఁ దనయొద్దకుఁ దీసికొనివచ్చున ట్లాజ్ఞాపించెను. కొంత మందిపోయి యాతని కా సగతిఁ దెలియఁ జేసిరి. అప్పు డుపగుప్తుడు భిక్షు మండలము నొద్దకు మరల వచ్చు విషయమునఁ దనయనిష్టమును సూచించెను. పరితప్తహృదయుం డగుమహారా జంత మాత్రముతో నూరకుండ లేను. ఆతఁడు మరల నాతని బలవంతముగఁ దీసికొనివచ్చుట కాజ్ఞాపించెను. అప్పుడు పగుప్తుఁ డేమియుం జేయఁజాలక త్వరలో నే వచ్చెదసని వార్తనంపించెను. అందువలన నశోకున కించుక యూరట

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/79&oldid=334352" నుండి వెలికితీశారు