పుట:ASHOKUDU.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

అ శో కుఁ డు

యెను. కపట వేషధారులగు మతవిరోధులను రాజ్యమునుండి పొఱఁద్రోలినచో నప్పుడు నిష్కంటకముగ మత ప్రచారము కాఁగలదని యాతని కాశయు, విశ్వాసమును గలిగెను, ఈ యుద్దేశము ప్రకటించుటకై యామహారాజు తనయున్నతోద్యోగి నొక్కని భిక్షుమండల సాన్నిధ్యమునకుఁ బంపించెను. రాజోద్యోగి వారికి మహా రాజాభిప్రాయమును దెలియఁ జేసెను. కపటాత్ములగు మతవిరోధులు చాల భయపడిరి. రాజో ద్దేశమును నిరర్థకముగఁ జేయుటకో మఱియెందులకో గాని భిక్షుమండలమునఁ గొందఱుకొందఱు రాజో ద్దేశముం గూర్చి తీవ్రముగ నాలో చింపసాగిరి. ఇందువలన రాజోద్యోగి కి విషమక్రోధము కలిగెను. ఆ కారణముం బట్టి యా యుద్యోగి యాభిక్షులలోఁ గొందఱను వధించి వైచెను. ఒకటి చేయఁబోయిన మఱియొకటి యయ్యెను. రాజోద్యోగి చేసిన దుష్కార్య మశోకమహారాజునకుఁ దెలిసినది. ఆతఁ డిప్పుడు ధర్మాస క్తుఁడై యున్నాడు; ఈ భయంకర కార్యముంగూర్చి మిగులఁ బరితపించెను; ఈయపరాధము తనదియే యని భావించుకొనియెను; ఏమనిన- తానే యాయద్యోగిని బిక్కు మండలము నొద్దకుఁ బంపియున్నాఁడు. అతనిఁ బంపక పోయినచో నిట్టీవిపరీతము కలిగియుండదుగదా యని మహా రాజగు నశోకుఁడు భావించుకొనుచు నస్థిర చిత్తుఁ డయ్యెను. అప్పుడాతఁడే స్వయముగఁ బోయి భిక్షుగణముం జూచి " ఈనర హత్యల విషయమున నపరాధ మెవ్వరిది?” అని ప్రశ్నించెను.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:ASHOKUDU.pdf/78&oldid=334349" నుండి వెలికితీశారు